ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మరాడు. నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి… కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి… ఇప్పుడు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆనం రాంనారాయణరెడ్డి ఈరోజు వైసీసీలో చేరుతున్నారని సమచారం. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఇటివలే జగన్ ను కలిశారు. దీంతో కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆనం ఆదివారం పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్టు సమాచారం.
