ఆంధ్రప్రధేశ్ రాజకీయల్లో అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టింది. చిన్న పిల్ల తనకేం తెలుసునని అందరూ అనుకున్నారు అయితే ఇప్పడూ ఈమె స్పీచ్ చూస్తే వామ్మో అంటున్నారు. ఇంతకి ఆమె ఎవరనుకున్నారు…. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ఫిరాయింప్ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మంత్రి గారు ఏం మాట్లాడినారంటే..ఈ రోజు అందరు నాటకాలు ఆడుతున్నారని అఖిలప్రియ అన్నారు. పదవుల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో వీళ్లంతా కలుసుకుంటున్నారని చెప్పారు. ఏకమవుతున్న తన ప్రత్యర్థులకు, వారి కేడర్‌కు ఒక్కటే చెబుతున్నానని, ఇన్నాళ్లు ఆయన కోసం మీరు (కేడర్) ఇబ్బంది పడ్డారని, మీపై కేసులు వచ్చాయని, మీరు నష్టపోయారని, కానీ ఇప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టి తన లబ్ధి కోసం వైసీపీలోకి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యర్థి కేడర్‌కు నేను ఒక్కటే చెబుతున్నానని, మీరు పని చేయాలనుకుంటే, మీకు గౌరవం కావాలనుకుంటే మా వద్దకు రావాలని, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. నేను చావనైనా చస్తాను కాని ఒకరి వద్ద తలదించనని అఖిలప్రియ చెప్పారు. మిమ్మల్ని (తన కేడర్) కూడా తలదించకుండా చూసుకుంటానని చెప్పారు. ఇన్ని రోజులు వర్గం కోసమో, గ్రూప్ కోసమో మీరు త్యాగాలు చేశారని, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, ఎంత నష్టపోయారో ప్రత్యక్షంగా నేను చూశానని చెప్పారు. నా తల్లిదండ్రులు కూడా మీ కోసం ఎంతో తపించడం చూశానని, అవన్నీ నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని తలదించుకోనియకుండా రాజకీయం చేస్తానని చెప్పారు.
