కర్నూలు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అధికారంలో ఉన్న టీడీపీ పార్టీలోకి చేరనున్నారు. కోట్లకు తెలుగుదేశం పార్టీ కర్నూలు ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం. కేవలం కర్నూలు ఎంపీ టికెట్ మాత్రమే కాకుండా, కోట్ల తనయుడికి లేదా కోట్ల భార్యకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వనున్నారట. డోన్ లేదా ఆలూరు ఎమ్మెల్యేగా వారిలో ఒకరు పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున నెగ్గి టీడీపీ లోకి ఫిరాయించిన బుట్టా రేణుక పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. 2014 ఎన్నికలల్లో కోట్లను ఓడించారు బుట్టా రేణుక. అయితే టీడీపీ ఆకర్ష్ పథకంలో భాగంగా పార్టీ ఫిరాయించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామనే ఒప్పందంతో ఆమె పార్టీలోకి వెళ్లారు. అయితే ఇప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరుతుండటం తో రేణుక కి రాజకీయంగా ఇబ్బందులు తప్పేలా లేవు. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకకు కర్నూలు లోక్‌సభ స్థానం టీడీపీ టికెట్ ఇస్తారని అనుకున్నారు. కాని ఆమె ఆశలను చెత్త బుట్టలో వేశారు అనేది ప్రదానంశంగా ఇప్పుడు టీడీపీ నేతల్లో చర్చనీయాంశం అయ్యింది. టికెట్ తనకే అంటూ ఆమె విస్తృతంగా పర్యటించింది. కాని చంద్రబాబు అవసరం తీరాక చెత్త బుట్టలో వేస్తాడన్న చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యవు బుట్టా రేణుక అంటున్నారు వైసీపీ అభిమానులు. వైఎస్ జగన్ నిన్ను కర్నూల్ కి ఎంపీని చేశాడు కాని నువ్వు ఏం చేశావ్ అంటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు వైసీపీ ఫ్యాన్న్.చూడలి మరి ఏం జరుగుతుందో..?
