వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందనే వార్తతో ఒక్కసారిగా వైసీపీలో ఆగ్రహం చెలరేగింది. సాక్ష్యాత్తూ చెవిరెడ్డే తనపై హత్యాయత్నానికి రెక్కీ జరిగిందని వెల్లడించారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీ వివరాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఎన్నికల కోసం 43 వాహనాలను అద్దెకు తీసుకున్నామని, అయితే తనకు తెలియకుండా డ్రైవర్లుగా ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకొచ్చారన్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్ పులివర్తి నాని పంపిన మనుషులని చెవిరెడ్డి తెలిపారు. తన దగ్గర కారు డ్రైవర్లుగా నెల క్రితం చిత్తూరుకు చెందిన నాగభూషణం, సిసీంద్రీలు చేరారన్నారు. ఒకొక్కరికీ రూ.15 లక్షల చొప్పున ఒప్పందం కుదిరిందన్నారు. పులివర్తి నాని పంపితేనే మేం చెవిరెడ్డి వద్ద కారు డ్రైవర్లుగా చేరామని వారు తెలిపారన్నారు. తన దైనందిక కార్యక్రమాలపై నిఘా పెట్టారన్నారు. తిరుపతిలో ఇలాంటి సంస్కృతి లేదన్నారు. ఎవరితోనూ వ్యక్తిగతంగా వివాదాలు తనకు లేవన్నారు. ప్రపంచంలోనే అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటివి జరగడం భాధాకరమన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తెలుగుదేశం రాజకీయాలు చంపుకోవడం వరకూ తీసుకొచ్చాయింటే ఎలాంటి పరిపాలన జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు వైసీపీ శ్రేణులు. మరోవైపు గతంలో తెలుగుదేశం నేతల చేతిలో దారుణంగా హత్యగావింపబడ్డ చెరుకులపాడు నారాయణ రెడ్డి ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. డ్రైవర్ల సాయంతో హతమార్చడం వెలుగులోకి రావడం పట్ల ఆందోళన చెందుతున్నారు.
See Also: స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే రాజీనామా..ఈ నెల 13న వైసీపీలోకి
See Also: