ఏపీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సినీ నటులు, సామాన్యులు వైసీపీలోభారీగా చేరుతున్నారు. తాజాగా సినీనటుడు అలీ వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్ జగన్‌తో లోటస్ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు. షెడ్యూల్ విడుదలై ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలోకి ప్రముఖుల చేరికలు ఊపందుకున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకముందు కొంతమంది సినీ నటులు కూడా పార్టీలో చేరారు. ఇంకా చాలమంది వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.