ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్‌కు అనుకోని సంఘటన ఎదురైంది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ మండలం నిడమర్రు గ్రామంలో నిన్న రాత్రి లోకేష్ ఓ హోటల్ వద్ద ప్రసంగిస్తున్న సమయంలో పై నుంచి హోల్డింగ్ పడింది. ‘ అయ్యో పసిబిడ్డను చంపేస్తారా ఏంటి, అయ్యగోరికి అనుకోని ఆత్మీయ స్వాగతం, నారా లోకేషా మజాకా, ప్రసంగానికి బోర్డే కుప్పకూలింది, మామ సిల్వర్ స్క్రీన్ మీద తన ప్రతాపం చూపిస్తే….అల్లుడు రియల్‌గా చూపించాడబ్బా, దీన్ని కూడా ప్రతిపక్షం కుట్ర అంటారేమో’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ విషయంలోకి వస్తే… మంత్రి నారా లోకేష్ గ్రామంలోని సద్గుణ టిఫిన్ సెంటర్ వద్ద మాట్లాడుతుండగా అక్కడ హోటల్ బోర్డు ఒక్కసారిగా కూలింది. అయితే ప్రచార సభలో పాల్గొన్న కార్యకర్తలపై ఈ బోర్డు పడింది. లోకేష్‌తో పాటు ఎంపీ గల్లా జయదేవ్…మిగతా నేతలు అంతా కొద్ది దూరంలో ఉన్నా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇంకా మరోక విషయం ఏమిటంటే నారా లోకేష్ బాబు సమక్షంలో చిన బాబులు భారీగా టీడీపీలోకి చేరారు..ప్రస్తుతం వాటికి సంభందించిన పోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.