కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ సరళిపై అభ్యర్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సమావేశానికి కర్నూలు జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అఖిల ప్రియ, బుడ్డా రాజేశేఖర్ రెడ్డి, కేఈ శ్యాంబాబు, టీజీ భరత్, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు, కేఈ ప్రతాప్‌లు గైర్హాజయ్యారు. సమావేశానికి వచ్చిన నాయకులతోనే వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు సీఎం బయలుదేరి వెళ్లారు.
