ఏపీలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం బూత్ నంబర్ 197లో రీ పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తాడని ఇప్పటికే అన్ని సర్వేలు తెలిపాయి. ఇక పోలింగ్ జరిగే స్థానల్లో కూడ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైన ఏపీలో వైఎస్ జగన్ మే23 తరువాత ప్రజలకు ఏం చెయ్యబోతున్నాడనేది తెలియాలి.
