ఏపీలో ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో మనందరికి తెలుసు… టాలీవుడ్ నుండి సినీ తారలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు , ఎంపీలు, పలువురు ప్రముఖులు, వైసీపీలో చేరారు. అయితే అది ఎన్నికల ముందు కాబాట్టి పార్టీలో చేరితే టిక్కెట్ గాని , లేదా ఏదైన పదవి గాని వస్తుందని ఆశతో పార్టీలో చేరుతుంటారు అనుకోవచ్చు. కాని ఏపీ చరిత్రలో ఎన్నికలు ముగిశాక ,ఆ ఎన్నికలు ఫలితాలు రాకముందే ఆ పార్టీ గెలుస్తాదని తెలిసి ఆ పార్టీలోకి ముందే అధికార పార్టీనుండి ఇద్దరు మంత్రులు పార్టీ మారుతుండడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయానికి వస్తే ఏపీలో ఎప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. మే23న ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్ గెలుస్తాడని వచ్చిన సర్వేలన్ని తెలిపాయి. అయితే ఇది ముందుగానే పసిగట్టిన ఇద్దరు టీడీపీ మంత్రులు వైసీపీలో చేరిపోవడానికి రెడి అయ్యారంట. అంతేకాదు ఎన్నికలకు ముందే వీరు వైసీపీలో చేరాలని చూశారంట. కాని జగన్ టిక్కెట్ ఇచ్చే స్థానంలేదు అన్నారంట.అయిన వైసీపీలో చేరాలని చూశారంట. ఇంతలో చంద్రబాబు వారిని బుజ్జగించి గెలిచేది మన పార్టీనే అని వారు పార్టీ మారకుండా చేశారని విశ్వసనియ సమచారం. ఇప్పుడు ఎవరు చెప్పిన..ఏమి చెప్పిన ఆ ఇద్దరు టీడీపీ మంత్రులు వైసీపీలో చేరిపోవాడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
