మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ‘B’, ‘C’, ‘E’ మరియు ‘పప్పిన్’ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. ఈ ఎంజైమ్ జీర్ణ వ్యవస్థలో ఉండే ఆహార పదార్థాలను విచ్చిన్నపరచి, అధిక క్యాలోరీల రూపంలో మరియు కార్బోహైడ్రేట్ల రూపంలోకి మార్చుటకు సహాయపడుతుంది. అంతేకాకుండా బొప్పాయి పండు, జీర్ణక్రియలలో సహాయపడి, జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది.
బొప్పాయిపండు మరియు మిరియాల కలయిక జీవక్రియను అధికం చేస్తుంది మరియు జీర్ణక్రియను పునరుద్దపరుస్తుంది. అంతేకాకుండా, పేగు లోపలి గోడల పనితీరును అధికం చేసి శరీర బరువును తగ్గిస్తుంది. బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి, జీవక్రియను అభివృద్ధి చేసి మరియు జీర్ణాశయ సమస్యలను దూరం చేస్తుంది.
1)ఈ ఔషదాన్ని ఎలా వాడటం?
బొప్పాయి పండు శరీర బరువును తగ్గించటమేకాకుండా, వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు రక్తంలో ఉండే విషపదార్థాలను తొలగించి, పేగు కదలికలను సాధారణ స్థాయికి తీసుకువస్తాయి. బొప్పాయి పండుకు ఒక చిటికెడు మిరియాలను పొడిని కలపటం వలన బొప్పాయి పండు రుచి పెరగటమేకాకుండా, శరీర బరువు కూడా పెరుగుతుంది.
చిన్న పచ్చి బొప్పాయిపండున తీసుకొని, పైన పొరను తొలగించి ముక్కలుగా కత్తిరించండి. ఇపుడు రుచికోసం దీనికి కొద్దిగా నీటిని, ఉప్పు మరియు దంచిన మిరియాల పొడిని కలపండి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమం వారానికి ఒకసారి తినటం వలన అనూహ్యమైన ఫలితాలను మీరే గమనిస్తారు.
2)బరువు తగ్గించుకోటానికి బొప్పాయిని తినండి
మీరు బొప్పాయి పండు తినటం ఇష్టమా? అయితే ఒక కత్తిరించిన బొప్పాయి పండు నుండి ముక్కను తీసుకొని నేరుగా తినండి. అంతేకాకుండా, ఫాట్ ను కలిగి ఉండే ఇతర ఆహార పదార్థాల ద్వారా తీసుకోవటం వలన బొప్పాయి పండు సరైన ఫలితాలను ఇస్తుందని అధ్యయనాలలో పేర్కొనబడింది.
బొప్పాయి పండుతో తయారు చేసిన స్మూతీస్ మంచి రుచికరంతో పాటూ అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది. బొప్పాయి పండు స్మూతీస్ తయారు చేయటం కూడా అంతకష్టం ఏమికాదనే చెప్పాలి. దీనిలో దంచిన బొప్పాయి పండుకు పాలు పెరుగు కలిపి గ్రైండ్ చేయాలి. వీటికి స్మూతీస్ చిక్కగా మరింత రుచికరంగా మారుటకు అరటిపండు లేదా సపోట వంటి ఇతర పండ్లను కలుపుకోవచ్చు.
మీరు తినే ఫ్రూట్ సలాడ్ లలో కూడా బొప్పాయి పండును కలుపుకోండి. ఇతర పండ్లతో పాటుగా మిరియాల పొడిని కలపటం వలన సలాడ్ రుచితో పాటూ, పోషక విలువలు కూడా పెరుగుతాయి