ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు.
