లోక్ సభలో నాల్గో అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, 23 మంది ఎంపీలతో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీగా ఉండగా 22 మంది ఎంపీలతో వైసీపీ నాల్గో స్థానంలో ఉంది. డీఎంకే యూపీఏ పక్షంలో ఉండటంతో డిప్యూటీ స్పీకర్ పదవిని వైసీపీకి ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై జగన్‌తో చర్చించినట్టు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి వైసీపీ అంగీకరిస్తే అరకు ఎంపీ జీ.మాధవి లేదా అమలాపురం ఎంపీ చింతా అనురాధరకు దక్కే అవకాశముంది.
