వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తన మరో హామీ నెరవేర్చడానికి సిద్దం అవుతున్నారు. కడప జిల్లా జమ్మల మడుగు లో జరిగిన రైతు దినోత్సవం లో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని స్టీల్ ప్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేసి,మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ హామీ ఇచ్చానని, ఆ ప్రకారం నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ఆరంబించామని ఆయన చెప్పారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై డ్రామాలు ఆడిందని ఆయన అన్నారు.ఇది పూర్తి అయితే 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు.చెన్నూరు సుగర్ ప్యాక్టరి పునరుద్దరణకు అరవై కోట్లు అవసరమని కలెక్టర్ చెప్పారని,ఆ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశించామని అన్నారు.
