దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన ఒక స్వర్ణయుగం. ఆయన మరణించిన పదేళ్ల తరువాత ఆంధ్రరాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.. ఇది రాష్ట్ర రైతాంగం చెప్తున్న మాట. మహానేత జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే జగన్ కూడా తండ్రిపేరుతో పార్టీ స్థాపించి పదేళ్లపాటు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చారు. రైతులకోసం ఎంతవరకూ చేయగలనో అంతవరకూ చేస్తానంటున్నారు. అలాగే జగన్ తండ్రిని అనుకరిస్తుంటారనేది అందరికీ తెలిసిందే.. వైఎస్ బ్రతికున్నపుడు జగన్ ని పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా చూసిన ఘటనలు చాలా తక్కువ.. ఎక్కువశాతం వ్యాపారాలపైనే జగన్ దృష్టి సారించేవారు. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ రాజకీయంగా వేసిన ప్రతీ అడుగు తండ్రిని దృష్టిలో పెట్టుకునే వేసేవారు. అయితే ఆహార్యం విషయంలోనూ జగన్ తండ్రినే ఫాలో అవుతున్నారనేది తాజాగా అర్ధమవుతోంది. కారణం.. జగన్ రాజకీయ అరంగేట్రం చేసిన కొత్తలో చారల చొక్కాల్లోనే కనిపించేవారు.. అప్పుడు అదే ట్రెండ్ అయ్యింది. తర్వాత లైట్ కలర్ చొక్కాలు, యువభేరిల్లో నీలం రంగు చొక్కాలు ధరించారు. పాదయాత్ర మొత్తం వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి అయినప్పటినుంచి జగన్ తెలుపురంగు చొక్కా, లైట్ బిస్కట్ రంగు దుస్తుల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ డ్రెస్ ఫార్మాట్ వైఎస్ దాదాపుగా పదిహేనేళ్లక్రితమే వేసుకున్నారు. సాధారణంగా పట్టు పంచెలో మాత్రమే కనిపించే పెద్దాయన, ఇంట్లోని కార్యక్రమాలకు, విదేశాలకు వెళ్లినపుడు మాత్రం తెలుపురంగు చొక్కా బిస్కట్ రంగు ప్యాంటు వేసుకునేవారు. ఇప్పుడు జగన్ కూడా ఇలాగే మెయిన్ టెయిన్ చేస్తున్నారు. యాధృచ్చికమో, తండ్రి లక్షణాలు, అలవాట్లు, అభిరుచులు పునికిపుచ్చుకోవడమో తెలియదు కానీ తండ్రికొడుకులిద్దరూ చాలా సందర్భాల్లో ఒకేలా కనిపిస్తుంటారు.
