జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకే ఇచ్చారు. జగన్ కు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జై కొట్టడం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ నేతలు ఇపుడిదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకెళ్ళినట్లు సమాచారం.ఇంతకీ విషయం ఏమిటంటే వైఎస్సార్ ఫించన్ల పథకం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో తన నియోజకవర్గమైన రాజోలులో రాపాక కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాపాక మాట్లాడుతూ పేద ప్రజలకు ఎవరు మంచి పనులు చేసినా వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సిందే అన్నారు. కుల, మతాలకు, పార్టీల రహితంగా సంక్షేమ పథకాలు అందచేయాలన్న జగన్ ఆలోచనకు అందరూ మద్దతుగా నిలబడాలన్నారు. వైఎస్సార్ కూడా ఇలాంటి పథకాల వల్లే జన హ్రుదయాల్లో నిలిచిపోయినట్లు రాపాక చెప్పారు. ఇపుడు జగన్ కూడా తండ్రి వైఎస్సార్ లాగే సంక్షేమ పథకాల అమలులో జనాలకు బాగా దగ్గరవుతున్నట్లు కితాబివ్వటం గమనార్హం. ఎప్పుడైతే జగన్ ను పొగుడుతూ రాపాక మాట్లాడారు వెంటనే పార్టీలో సంచలనంగా మారింది. అంతేకాదు గెలిచిన దగ్గర నుండి వైసీపీ లో చేరటానికి రాపాక ప్రయత్నిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ మాటలను బట్టి చూస్తే అతి త్వరలోనే వైసీపీలోకి జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
