కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించింది. విశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీచేసింది. చత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ గా అనసూయా ఉయికేను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఫైల్ పై సంతకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు డిసెంబర్ 2009లో గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ ను కేంద్రం నియమించింది.
అయితే కొత్త గవర్నర్ ప్రొఫైల్ ఇదీ..
పేరు : విశ్వభూషణ్ హరిచందన్
సొంత రాష్ట్రం : ఒడిషా
పుట్టింది : 03/08/1934
భార్యపేరు : సుప్రవ హరిచందన్
క్వాలిఫికేషన్ : బీఏ హానర్స్ ఎల్ఎల్ బీ
హాబీలు : చారిత్రక ప్రదేశాల సందర్శన, పుస్తకాలు చదవడం
1971లో జన సంఘ్ లో చేరిక
1977లో జనతా పార్టీ ఒడిషా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఎన్నిక
1988లో ఒడిషా జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
1988లో ఒడిషా జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
1996 ఏప్రిల్ లో బీజేపీలో చేరిక
భువనేశ్వర్ ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎన్నిక
భారతీయ జనతాపార్టీలో సుదీర్ఘకాలం సేవలు
