ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పార్లమెంటు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రధాని మోడీని కలిశారు. దాదాపు 45 నిమిషాలు పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ రాష్ట్రం ఆర్థికంగా ఎదుర్కుంటున్న ఒడిదుడుకులను మోడీకి వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికసాయం కేంద్రం చేయాల్సిన అవసరంపై జగన్ వినతి పత్రాలు ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు అమలు చేయాలని కోరారు. జగన్ తో భేటీ ముగిసిన అనంతరం నేరుగా మోడీ కాశ్మీర్ పై జరుగుతున్న చర్చలో పాల్గొనేందుకు సభలోకి వెళ్లారు.
