ఇటీవల హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేసింది. అర్థరాత్రి పూట అపార్ట్మెంట్లు, ఇండ్లలో దూరి, మొదట సీసీ కెమెరాలు ఉంటే వాటిని ధ్వంసం చేసి..లేకుంటే వాటి పవర్ లైన్స్ కట్ చేసి…దోపిడీకి పాల్పడ్డేవారు. ఇప్పుడు చెడ్డా గ్యాంగ్ తరహాలోనే అసెంబ్లీలో సీసీ కెమెరాలు ఆపేసి ఫర్నీచర్‌ను తరలించుకుపోయిన ఘటన సంచలనంగా మారింది. టీడీపీ అంటే దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌కు మారింది. చిన బాబు, పెదబాబుల నుంచి జన్మభూమి కమిటీల పేరుతో ఊరూరా పచ్చబాబులు దోపిడీకి అనర్హం ఏదీ కాదంటూ ఇసుక, మట్టి , నీరు, చెట్టు…ఇలా పంచ భూతాలను దోచుకున్నారు. ఆఖరికి ఫర్నీచర్లను, పేపర్లను కూడా వదిలే టైపు కాదని టీడీపీ వాళ్లు.. స్వయంగా చెబుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాడు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్లపాటు ఉండే అవకాశం ఉన్నా…ఓటుకు నోటు కేసులో జైలుకు పోతాననే భయంతో చంద్రబాబు పార్టీ కార్యాలయాలను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించాడు. అలాగే అసెంబ్లీని కూడా అమరావతికి షిఫ్ట్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. అసెంబ్లీలో సీసీ కెమెరాలు ఆపేసి మరీ ఫర్నీచర్‌ను ఏపీ అసెంబ్లీ భవనానికి కాకుండా అప్పటి స్పీకర్ కోడెల ఇంటికి తరలించారు. అయితే ఈ విషయం అప్పుడు బయటకు రాలేదు. ఇప్పుడు ఏపీలో వైయస్ జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ స్పీకర్ గారి ఫర్నీచర్ దోపిడీ విషయం బట్టబయలు అయింది. దీంతో కోడెల వాటిని తిరిగి ఇస్తానని చెబుతున్నాడు. గతంలోనే ఫర్నీచర్ విషయం గురించి అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశానని, ఆ లేఖ అందలేదేమో అంటూ…కోడెల నాలిక మడతేస్తా అంటున్నాడు. ఇప్పుడు బండారం బయటపడడంతో వాటిని తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు. మొత్తంగా అసెంబ్లీ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఫర్నీచర్లను తరలించారంటే ఈ దోపిడీకి ఎంత పక్కాగా ప్రణాళిక రచించారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీలో ముఖ్య నేతలుగా బిల్డప్ ఇచ్చే నేతలు ఇలాంటి చిల్లర దొంగతనాలకు కూడా వెనుకాడని వైనంపై ప్రజలు విస్తుపోతున్నారు.
