నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లిలోని నివాసం చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి కేరళ, పశ్చిమబెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా,మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరవుతారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని చేపట్టాల్సిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు..
