ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, యరపతినేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి టీడీపీ ప్రముఖ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.దీనిపై రెండు, మూడు రోజుల్లో జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన యరపతినేని ఒక వేళ జగన్ సర్కార్ సీబీఐ విచారణకు అక్రమమైనింగ్ కేసును అప్పగిస్తే ఏం చేయాలనే దానిపై లాయర్లతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుండి యరపతినేని తన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో అక్రమ మైనింగ్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. అటు సొంత పార్టీ నుండి ఈ కేసు విషయంలో బయటపడేందుకు అటు సొంత పార్టీ నుంచి కూడా సహకారం అందకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక యరపతినేనిపై విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుపై స్పందించారు. హైకోర్టు తీర్పు పూర్తి సారాంశం వచ్చిన తర్వాత ఈ విషయమై ఏం చేయాలనే దానిపై సీఎం జగన్ నిర్ణయం తీసుకొంటారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో, టీడీపీ పెద్దల అండదండలతో గుంటూరు జిల్లాలో యధేచ్ఛగా సున్నపురాయి అక్రమ మైనింగ్‌కు పాల్పడి, వేల కోట్లు దోచుకున్న యరపతినేని చివరకు అజ్ఞాతంలో వెళ్లాల్సి వచ్చింది. హైకోర్ట్ కూడా యరపతినేని అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడని తేల్చి చెప్పింది కాబట్టి…ఈ కేసులో యరపతినేని జైలుకు వెళ్లడం ఖాయమని గురజాలలో చర్చ జరుగుతోంది.
