ఏపీలోని అన్ని జిల్లాలో గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరాయి. కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. అన్ని జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
పరీక్షల షెడ్యూలు ఇదే..
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 2, 5 తేదీలు మినహా మిగిలిన తేదీల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూలును ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
⇔ 1వ తేదీ ఉదయం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్–5, మహిళా పోలీసు, సంక్షేమ విద్యా కార్యదర్శి( గ్రామీణ), వార్డు పరిపాలనా కార్యదర్శి.
⇔ 1 మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6, డిజిటల్ అసిస్టెంట్
⇔ 2వ తేదీ సెలవు
⇔ 3వ తేదీ ఉదయం వీఆర్వో, సర్వే అసిస్టెంట్
⇔ 3న మధ్యాహ్నం ఎఎన్‌ఎం/వార్డు హెల్త్ అసిస్టెంట్
⇔ 4 ఉదయం విలేజి అగ్రికల్చర్ సెక్రటరి
⇔ 4వ తేదీ మధ్యాహ్నం విలేజీ హార్టికల్చర్ సెక్రటరి
⇔ 6వ తేదీ ఉదయం విలేజి ఫిషరీస్ అసిస్టెంట్
⇔ 6వ తేది మధ్యాహ్నం పశుసంవర్ధక అసిస్టెంట్
⇔ 7వ తేదీ ఉదయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2), వార్డు ఎమినిటీస్ సెక్రటరి
⇔ 7వ తేదీ మధ్యాహ్నం విలేజి సెరీకల్చర్ అసిస్టెంట్
⇔ 8 ఉదయం వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరి, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరి
⇔ 8న మధ్యాహ్నం వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరి, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శి (గ్రేడు–2)
⇔ గ్రామ,వార్డు సచివాలయంలోని 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పది రాత పరీక్షలకు తెలుగు, ఇంగ్లిషు ప్రశ్నపత్రాలు ఉంటాయి.