పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్‌బీహెచ్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు.
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మోటార్ సైకిళ్ల సైలెన్సర్లు తీసి గట్టిగా కేకలు వేస్తూ, మనుషులపైకి దూసుకెళ్తూ ర్యాలీలు నిర్వహించారు. జన సైనికులు, కార్యకర్తలు చేస్తున్న ధ్వనికాలుష్యం, ఫ్లెక్సీ ధ్వంసం వంటి కార్యక్రమాలపై మండల వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీని బ్లేడ్లతో కోసి ధ్వంసం చేయడంపై మండల వైసీపీ శ్రేణులు వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. బాధ్యులను గుర్తించి విచారణ చేపడతామని వీరవాసరం ఎస్సై బి.మహేశ్వరరావు తెలిపారు.