కోడెల శివప్రసాదరావు మృతికి ఆయన కుటుంబ సభ్యులు, చంద్రబాబే కారణమని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగత ప్రత్యర్థి కాదన్నారు. పార్టీ సినియర్ నేత చనిపోతే టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కోడెల మృతి వెనుక మిస్టరీ ఉందన్నారు. స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ప్రభుత్వ హత్య అని మాట్లాడుతున్నారన్నారు. సాక్షాత్తు చంద్రబాబు రంగంలోకి దిగి వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని, దేశంలోనే ఇలాంటి సంఘటన లేదన్నారు. ఈమరణాన్ని జగన్ మీద రుద్ది సింపథీ పొందాలని, రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎదుటివారి క్యారెక్టర్‌ను భయటపెట్టవచ్చుని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటినుంచి నాలుగుసార్లు మీడియా ముందుకు వచ్చారు. చెప్పిందే చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. ఇది రాజకీయాల్లో అతి నీచమైన కార్యక్రమ అన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాడని టీడీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవాలు చూస్తే ఆయన ఉరితాడు వేసుకొని మరణించాడన్నారు. పల్నాడి పులి అనిపించుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అని ప్రశ్నించారు.
ఒక్క కేసులోనైనా కోడెలను అరెస్టు చేశారా? ఎవరైనా పోలీసులు ఆయన్ను సంప్రదించారా.? అని ప్రశ్నించారు. ఈ మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులు, టీడీపీ రెండో కారణమని అందరూ అంటున్నారన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చంద్రబాబు ఆదేశాలమేరకు కోడెల వారిపై అనర్హత వేటు వేయలేదని, మేం ఆరోపణలు చేస్తే చంద్రబాబు ఏ నాడు కూడా ఖండించలేదన్నారు. కోడెల కుటుంబంపై చంద్రబాబుకు అంత ప్రేమఉంటే ఆయన కుమారుడు, కుమార్తెలను నరసరావుపేట, సత్తెనపల్లెకు ఇన్‌చార్జ్ లుగా చేయాలని, అంతేకాని మాపై విమర్శలు చేయడం సరికాదన్నారు.