తెలుగుదేశంపార్టీ క్రియాశీలక సభ్యులు, సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కోడెలా గురించి ఆయన వ్యక్తిగతం గురించి చంద్రబాబు సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా దారుణమన్నారు. కోడెల మరణం వాళ్ళఇంట్లో జరిగిన గొడవలు, వాళ్ల ఆస్తి పంపకాలు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తి విషయంలో కొడుకు, కుమార్తె మధ్య గొడవల గురించి పల్నాడులో అందరికీ తెలిసిందేనన్నారు. పల్నాడులో కోడెల బాధితులు వేలమంది ఉన్నారని, అందులో మా బంధువులు కూడా ఉన్నారన్నారు. చంద్రబాబు అండతో కోడెలా విపరీతమైన అవినీతికి పాల్పడింది నిజం కాదా అని నర్సిరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా కోడెల చేసిన పలు అక్రమాలను ఆయన వివరించారు.
1.కొండమోడు శ్రీకాళహస్తి రైల్వే పనులు చెయ్యకుండా కాంట్రాక్టర్ ను బెదిరించి కమిషన్ ఇవ్వలేదని కాంట్రాక్టర్ పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి కమిషన్ తీసుకోవటంలో కోడెల శివరాం ముఖ్యపాత్ర వహించాడని, ఈ ఘటనలో వర్కర్స్ షెడ్లను కూడా తగల పెట్టించాడని నర్సిరెడ్డి తెలిపారు.
- ధూళిపాళ్ల గ్రామంలో 18ఎకరాల రైతుల భూమిని ఆక్రమించి దానిలోని కోళ్ల ఫారలను తగలబెట్టి అక్కడి రైతులపై దాడిచేసి వారిని తరిమికొట్టి అక్కడి 18 ఎకరాలను అక్రమించిన్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.
- రాజుపాలెం గ్రామంలో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగస్తుల ఐదెకరాల్లో ఉన్న నిమ్మ తోటని ప్రోక్లైన్ తో పీకించి శివరాం మనుషులు ఆ పొలాన్ని అక్రమించుకున్నారన్నారు.
- సత్తెనపల్లిలో కోడెల కుమార్తెకు చెందిన సేఫ్ మందుల కంపెనీకి సంబంధించిన మందులను మెడికల్ షాప్ ల వాళ్ళను బెదిరించి టార్గెట్స్ పెట్టి మందులను అమ్మించి ఎందరో అమాయక ప్రజల ప్రాణాలు తీశారని నర్సిరెడ్డి అన్నారు.
5 సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో సంవత్సరానికి ఒక్కో బ్రాందీ షాప్ కు పాతిక లక్షల నుంచి 50లక్షల వరకు 5 సంవత్సరాలు కోడెల శివరాం వసూలు చేయడం జరిగిందని నర్సిరెడ్డి అన్నారు.
- సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గాల్లో స్వీట్స్ షాప్ నుంచి గోల్డ్ షాప్ దాకా డైలీ మామూళ్లు వసూలు చేశారని నర్సిరెడ్డి అన్నారు
- అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకు వచ్చే భోజనాన్ని తన సేపు కంపెనీలో పనిచేసే తన వర్కర్స్ కు 50 రూపాయలకు అమ్మినట్లు నర్సి రెడ్డి తెలిపారు.
- కోడల శివ రామ్ కు సంబంధించిన మోటార్ బైక్ షో రూమ్స్ లో ప్రభుత్వానికి లైఫ్ టాక్స్ కట్టకుండా బైకులు అమ్ముకున్నారని, ఆ విషయంలోనే శివరాంకు సంబంధించిన బైక్ షోరూంలను సీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమేగా అన్నారు.
9.రెండు నియోజకవర్గాలలో ప్రభుత్వ కాంట్రాక్టర్స్ దగ్గర అన్ని పనులకు సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా 10% కమిషన్ తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు.
- రెండు నియోజకవర్గాలలో అపార్ట్మెంట్స్ కట్టాలన్న ల్యాండ్ కన్వర్షన్ చేయాలన్న వారిని బెదిరించి వాటలు తీసుకున్నది నిజం కాదా అని నర్సి రెడ్డి ప్రశ్నించారు.
11.రెండు నియోజకవర్గాల గుండా వెళుతున్న ఇసుక లారీలను అడ్డగించి ఇసుకను అన్ లోడ్ చేపించుకోవటం నిజం కాదా అని నర్సిరెడ్డి ప్రశ్నించారు.
ఇన్ని అరాచకాలు చేసిన కుంటుంబాన్ని పక్కన పెట్టుకొని చంద్రబాబు అబద్ధపు మాటలు అసత్య ప్రచారం, అయన శవ రాజకీయాలు చూడలేక టీడీపీని వీడుతున్నానని ఆయన తెలిపారు.