ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన ను వేగవంతం చేశారు ఎక్కడ సమస్య వచ్చిన ముఖ్యమంత్రి నిమిషాలు ప్రకారం సమస్య ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు. రోడ్డుప్రమాదం, వరదలు ,ఏరియల్ సర్వేలు, గతంలో పోలవరం ముంపు ప్రాంతం ఇలా ఏ ఘటన చూసిన జగన్ రాజధానిలో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదు చేయట్లేదు నేరుగా రంగంలోకి దిగుతున్నారు తాజాగా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఐదు రోజులుగా నంద్యాలలో కురుస్తున్న వర్షాలకు తోడు నల్లమలలోని ఫారెస్ట్ అడవుల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆ నీరు నంద్యాల పట్టణంలోని చేరుకుంది. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. మరికాసేపట్లో హెలికాప్టర్ ద్వారా ఆయన ముఖ్య ప్రాంతాల్లో పర్యవేక్షించి అనంతరం జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు పరిపాలనలో వేగవంతం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం మరోవైపు ప్రకృతి విపత్తులు పర్యవేక్షణ వంటి ఘటనలు హ్యాండిల్ చేయడం వంటి ఘటనలతో సీఎం తీరిక లేకుండా గడుపుతున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తు దూసుకుపోతున్నారు
