ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం నుంచి దశమి వరకు పది రోజులపాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. రాష్ట్ర పండగ కావడంతో అన్ని ప్రభుత్వ రంగ శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉ.9 గంటలకు భక్తులు అమ్మవారి దర్శనం ఇస్తున్నారు.
ఏ రోజున ఏ అలంకారం..
29న స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి
30న బాలా త్రిపుర సుందరీదేవి
01న గాయత్రి దేవి
02న అన్నపూర్ణాదేవి
03న లలితా త్రిపుర సుందరీదేవి
04న మహాలక్ష్మీ దేవి
05న సరస్వతీదేవి (మూలా నక్షత్రం)
06న దుర్గాదేవి (దుర్గాష్టమి)
07న మహిషాసుర మర్ధనీదేవి (మహర్నవమి)
08న రాజరాజేశ్వరీ దేవి (విజయ దశమి)