ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి కలిసారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా ఆపార్టీలో చేరనున్నారు. వీరిలో
01. శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ),
02. వాకాటి నారాయణరెడ్డి (, ఎమ్మెల్సీ – టీడీపీ)
03. చింతల పార్థసారథి (జనసేన)
04. పాతూరి నాగభూషణం (మాజీ జెడ్పీ చైర్మన్)
05. నక్కా బాలయోగి (హైకోర్టు మాజీ న్యాయమూర్తి)
06. తోట నాగేష్ (టీడీపీ)
07. రామినేని ధర్మ ప్రచారం (ఎన్ఆర్ఐ – రామినేని ఫౌండేషన్),
08. గట్టి చిన్న సత్యనారాయణ (టిడిపి నేత),
09. బొబ్బిలి శ్రీనివాస రావు (కాంగ్రెస్ నేత),
10. రవి (పూతల పట్టు) ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో పుంజుకునే పరిస్థితులు లేకపోవడం, అధికార వైసీపీలోకి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో వీరంతా బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. మరికొద్దిరోజుల్లో బీజేపీ ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించేదుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.