గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఝలక్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిరాశ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ అంటూ ఎల్లో మీడియా ఇప్పటికీ విష ప్రచారం చేస్తోంది. ఉద్యోగులకు అనుమానాలు ఇబ్బందులు తెచ్చేలా ప్రవర్తిస్తోంది. ప్రతీ గ్రామంలో 12 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్ కే చెల్లింది.
సచివాలయాల ద్వారా ఒకవైపు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు గ్రామస్థాయి నుంచి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. అవినీతివ్యవస్థల ప్రక్షాళనకు జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేస్తాం అనే మాటను వలంటీర్ల ద్వారా చేసిచూపిస్తున్నారు. 72గంటల్లో సమస్యలు పరిష్కరిస్తాం అని నిరూపించడానికి గ్రామ సచివాలయ ఉద్యోగులు వచ్చారు. ఏ కార్డు కావాల్సినా 72గంటల్లో ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఎల్లో మీడియా జగన్ పై, ప్రభుత్వ విధానాలపై విషం కక్కడం ఆపట్లేదు.