బీజేపీ సీనియర్ నేత సునీల్ థియోరార్ టీడీపీ బీజేపీ పొత్తు పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు పచ్చి అబద్దాల కోరు అని అవసరాన్ని బట్టి రాజకీయ రంగులు మారుస్తారు అని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో గాని తాము పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీని వ్యతిరేకించడం కూడా ఆ పార్టీ ఘోర పరాజయానికి కారణం అని సాక్షాత్తు చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు అన్ని రాష్ట్రాలు తిరిగి మరి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకుని మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్న నేపథ్యంలో బీజేగ్రనేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
