గత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఆమోదా పబ్లికేషన్ సంస్థ అంటే ఆంద్రజ్యోతి మీడియాకు విశాఖ పట్నం నడిబొడ్డున పరదేశీపాలెంలో ఎకరంన్నర భూమిని కేటాయించిందని, అది పూర్తిగా అవసరం లేని కేటాయింపు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం అబిప్రాయపడింది.సుమారు 40 కోట్ల విలువైన భూమిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మీడియాకు గత ప్రభుత్వం కేవలం ఏభై లక్షల ఐదువేల రూపాయలకే కేటాయించారని ,దానిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని సమాచార శాఖ మంత్రి పేర్పి నాని వెల్లడించారు. నిజానికి ఆ పత్రికకు ఇప్పటికే అవసరమైన స్థలం ఉందని,అయినా కావాలని ఆ పత్రికకు గత ప్రభుత్వం కేవలం క్విడ్ ప్రోకో కింద ఆ భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు.అక్కడ ఆ భూమిలో నిర్దిష్ట కార్యకలాపాలు సాగడం లేదని, అందువల్ల ఆ భూమి కేటాయింపును రద్దు చేశామని ఆయన తెలిపారు.రాజకీయంగా శత్రువులపై విష ప్రచారానికి పాల్పడడానికే గత ప్రభుత్వం ఆ భూమి కేటాయింపు చేసిందని ఆయన అన్నారు.ఆ భూమి కేటాయింపును రద్దు చేసి బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని కూడా నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
