ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు యావత్ భారతదేశం మొత్తం చూస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టే విధానం ప్రజాసంక్షేమాన్ని చూసుకుంటున్న పద్ధతి ప్రజలకు ఏం కావాలి అనే దాని పై అధికారులతో చేస్తున్న సమీక్షలు, కేంద్ర ప్రభుత్వం తో వ్యవహరిస్తున్న తీరు, రాజకీయ పార్టీలతో మెలుగుతున్న విధానం, తన రాజకీయ పార్టీని నడిపిస్తున్న సిద్ధాంతం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్ వాస్తవానికి మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి అయిన ఆయన లో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఎటువంటి తొందరపాటుతనం కనిపించడం లేదు. పాలనా పరమైన అంశాలు కూడా జగన్ ఆచితూచి అడుగులు వేస్తూనే వేగంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చే నిధుల విషయంలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు అత్యంత ఆసక్తిని కలిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైన పథకాల అమలు ప్రవేశపెట్టిన కేవలం కొద్ది రోజులు లేని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అధికారులు లెక్కలు తో సహా ఢిల్లీలో ప్రత్యక్షం అవుతున్నారు. తమ రాష్ట్రానికి ఈ పథకం కింద ఎంతమంది ఉంటారు అంత నిధులు కావాలి నిధులు కావాలి అని ఎప్పటికప్పుడు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.
