ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న మంచి సంబంధం గురించి అందరికీ తెలిసిందే. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి కృష్ణ కుటుంబానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రంలో కూడా సినిమాల్లో రాజకీయాలు వేరు చేసి చూడలేము జగన్ అభిమానులందరూ మహేష్ బాబు ని అభిమానిస్తున్నారు. సినిమా పరంగా మహేష్ బాబు ను అభిమానించే ప్రతి ఒక్కరు జగన్ని రాజకీయంగా అభిమానిస్తారు. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భార్య ను కలిశారు. గతంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో మహేష్ బాబు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామ యోగక్షేమాలు చూసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ సినిమాల్లో బిజీగా ఉండటంతో ఆ బాధ్యతలను భార్య నమ్రత కు అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో బుర్రిపాలెం కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె విజయవంతంగా చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పరంగా తమకు సహకారం కావాలని నమ్రత భారతితో కలిసి మాట్లాడారు. అక్క చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని నమ్రత కోరారు. ఇప్పటికే కృష్ణ, రాజశేఖర్ రెడ్డి, మహేష్ బాబు జగన్ కాంబినేషన్తో వారి ఇరు కుటుంబాలు అభిమానులు పండగ చేసుకుంటే ఇప్పుడు నమ్రత భారతీల కలయిక అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.