ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏ మీడియా సమావేశం పెట్టిన ముఖ్యంగా ఓ మాటను పదేపదే ఉటంకిస్తున్నారు. ఆ మాట మాత్రం అనకుండా మీడియా సమావేశం ముగించడం లేదు. ఆమాటే అమరావతిని చంపేశారు. గతంలో ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతి కంపెనీ అనేవారు. అయితే తాజాగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఆస్తమాట్లు అమరావతిని చంపేశారు అనడం పట్ల సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. అసలు చంద్రబాబు ఈ మాట అనడానికి కొందరు విశ్లేషకులు మరో అర్థాన్ని చెబుతున్నారు. పార్టీలో నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కుని డబ్బుతో రాజకీయం చేసి మరో రెండు మూడు పర్యాయాలు తాను ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు భావించారట. ఈ క్రమంలో తమ కు ప్రధాన ఆర్థిక వనరులు పోలవరం అమరావతి లను ఎంచుకున్నారట. అయితే తాను పెంచుకున్న ఈ రెండు ఆర్థిక వనరుల ప్రాజెక్టులు తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసి ముందు అందులో జరిగిన అవినీతి బాగోతం బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ కూడా అమరావతిని కొంచెం కొంచెం అభివృద్ధి చేస్తూ తన పార్టీకి కావలసిన ధనాన్ని అందులో నుంచి స్వాహా చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అమరావతి ని చంపేస్తా అంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
