ప్రతి బుధవారం రైతు భరోసా పధకం కింద కొత్త లబ్ధిదారులకు చెల్లింపులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ కుమర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులకు మరో విడత రైతు భరోసా చెల్లింపులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు లక్షా ఐదు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని వెల్లడించారు. కాగా నవంబర్ 15 వరకు రైతు భరోసా పధకం కింద లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. వచ్చే రెండు బుధవారాల్లో లబ్ధిదారులకు రైతు భరోసా వర్తింపజేస్తామని అరుణ కుమార్ స్పష్టం చేశారు.
