ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆద్వర్యంలోని ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుందని సమచారం. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చడానికి గాను ‘నాడు-నేడు’తోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ‘మిషన్’ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ‘మిషన్ బిల్డ్’పేరుతో దీనిని ఏర్పాటు చేసి, అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను విక్రయించాలని నిర్ణయించింది. ‘ఆపరేషన్ బిల్డ్’ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’ (ఎన్బీసీసీ)తో కలిసి చేపడతారు. దీనిపై ఎన్బీసీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భూముల అభివృద్ధి, భవన నిర్మాణాలు, ఇంకా ప్రభుత్వ భూములను రియల్ వెంచర్లుగా మార్చడంలో ఎన్బీసీసీకి మంచి అనుభవం ఉంది.మిషన్ బిల్డ్కు ప్రవీణ్ కుమార్ను డైరెక్టర్గా నియమించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.
