ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ నెల పద్నాలుగో తారీఖున విజయవాడ కేంద్రంగా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తీర్చడానికి వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి దీక్ష టీడీపీ వర్గలు తెలిపాయి.
