ఏపీలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ భాదితుల్లో ఆనందం నింపాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . గత ప్రభుత్వ హాయంలో వినతి పత్రాలు, ఉద్యమాలు, ఆత్మహత్యలు కూడ జరిగాయి కాని అధికారులు పట్టించుకోలేదు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో బాగాంగ మీమ్మల్ని ఆదుకుంటా అని మాట ఇచ్చారు. నేడు ఆ మాట కట్టబడి అగ్రిగోల్డ్ బాధితుల్లో రూ. 10 వేల కన్నా తక్కువ డిపాజిట్ చేసిన వారికి డబ్బుల పంపిణీ ఈ ఉదయం మొదలైంది. వైఎస్ జగన్ ఒక్క క్లిక్ తో 3.70 లక్షల మంది ఖాతాల్లోకి మొత్తం రూ. 264 కోట్లను బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభకు హాజరైన ఆయన ఆన్ లైన్ విధానంలో డబ్బు బట్వాడా చేశారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని చెప్పారు.కాగా, ల్యాప్ టాప్ లో జగన్ బటన్ నొక్కగానే, వేలాది మంది ఖాతాల్లో వారి డిపాజిట్ జమ అయింది. పలువురు తమ సెల్ ఫోన్లను చూపిస్తూ, తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయన్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నరసన్నపేట మండలం, కిల్లం గ్రామానికి చెందిన బాధితుడు పొట్నూరు శ్రీనివాసరావు, తన అకౌంట్ లో రూ. 10 వేలు జమ అయ్యాయని చెబుతూ, సెల్ ఫోన్ చూపుతున్న ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాదు అనాడు మాకు న్యాయం జరుగుతుందని వైసీపీకే ఓటు వేశాం అంటున్నారు.
