ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి పార్టీలు సమాయత్తమయ్యే సమయం వచ్చేసింది . వచ్చే ఎడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎ జగన్ గ్రీన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.మంత్రులను స్థానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనున్నది. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ తరపున అథరైజేషన్ను మంత్రుల నుంచి తొలగించారు. కలెక్టర్లు, సెక్రటేరియట్లో హెచ్వోడీలకు అధికారం ఇచ్చారు. 20 కోట్లకుపైగా ఆదాయం వచ్చే దేవాలయాలకు ట్రస్ట్బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
