తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ కు తనకు పరిచయం ఉందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యాక్టరీలు మూసివేస్తే జగన్ తో మాట్లాడి తాను ఆ పనులు చేయించుకున్నారని అనంతరం దమ్ము సినిమా చూసి వస్తున్నప్పుడు హైవేలో డైరెక్ట్ గా అందరి ముందే జగన్ ని ఆలింగనం చేసుకున్నారు అని అయినా జగన్ కు ఎప్పుడు ఉపయోగపడలేదు అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను వెళ్ళి కనీసం పరామార్శించలేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారాలు తెలిసే తెలుగుదేశం పార్టీలో తనను అవమానాలకు గురి చేసినట్టు వంశి తెలిపారు. కొడాలి నాని ఎన్నికలకు ముందు తనను పార్టీలోకి రావాలని ఆహ్వానించిన తాను వెళ్లలేదని తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లాలో కొడాలి నాని చేసిన సేవ ఎవరు చేయలేదన్నారు. జగన్ తో తనకు పాతికేళ్ల పని ఉందని ఆయన గురించి తనకు పూర్తిగా తెలుసు అన్నారు. నమ్మిన మాట కోసం సిద్ధాంతం కోసం పని చేసే వ్యక్తి జగన్ అని జగన్ తనను ముందుకు నడిపిస్తారని నమ్మకం విశ్వాసం ఉందని వంశీ తెలిపారు.
