ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో నేత కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు గుడివాడకి తాకాయి. టీడీపీ నాయకులు ఒక్కొక్కరుగా వైసీపీ గూటిలోకి చేరుతున్నారు.దీనితో తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని బాబుకు అర్ధమైనట్లుంది. గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి షాకులు తగిలాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడగా, గుడివాడ టీడీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే వీరిద్దరు పార్టీని వీడటంతో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీకి అండగా నిలిచే నాయకుడే లేకుండా పోయాడు. అయితే ఇలా కష్టాల్లో కొట్టమిట్టాడుతున్న సమయంలోనే గుడివాడలో టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ కీలక నేత, ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య (బాబ్జీ) టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారని తెలుస్తోంది.దీంతో గుడివాడలో ఇది టీడీపీకి మరో ఎదురు దెబ్బే అని తెలుస్తుంది.
