ముద్దు ముద్దుగా కనిపించే చిన్న పిల్లలను చూసి పెద్ద వారు బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పిల్లలపై తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దుపెట్టుకున్నాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజనీకి ఓ కార్యక్రమంలో ఈ ఘటన ఎదురైంది. ఆమెకు స్కూలు విద్యార్థులు, పార్టీ శ్రేణులు అంతా స్వాగతం పలికారు. అక్కడికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు అడుగులు వేస్తున్నారు. స్కూలు విద్యార్థులు కూడా ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ సంబరపడిపోయారు. షేక్ హ్యాండ్ ఇస్తే ఏముంటుంది అనుకున్నాడో ఏమో ఇలా తన ఆప్యాయతను వ్యక్తం చేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాతో ఎమ్మెల్యే రజని షాక్ తిని.. ఆ తర్వాత సర్ ప్రైజ్‌గా ఫీలయ్యారు. ఆ చిన్నోడి సరదా చూసిన వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేపై ఆ పిల్లాడి ప్రేమ చూసి నెటిజన్లు తెగ లైకులు కొట్టేస్తున్నారు.
బుడ్డోడు మామూలోడు కాదు..ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు..!
Posted by Satyavathi Satya on Sunday, 24 November 2019
YSRCP MLA Vidadala Rajini from Chilkaluripet in Andhra Pradesh taken by surprise and laughs as a boy shows some affection on her. pic.twitter.com/xfUOGu45wl
— Sushil Rao (@sushilrTOI) November 25, 2019