ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. సమాజంలో బలహీన వర్గాలకు సమానం అవకాశాలు ఉండాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా… గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గన్న జగన్.. జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ.. 46 లక్షల రైతులకు పెట్టుబడిసాయం కింద రైతు భరోసా ఇచ్చామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించామని చెప్పారు. నాడు, నేడు ద్వారా పాఠశాలలను ఆధునికీకరిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నామన్నారు. జనవరి 9 న అమ్మొడి ద్వారా మహిళలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఉన్న చదువుల కోసం పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తామన్నారు. వసతి దీవెన ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని తెలిపారు. పేద విద్యార్థుల చదువుకు ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పారు. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలని జ్యోతిరావు పూలే పోరాటం చేశారన్నారు. బలహీన వర్గాల మహిళలు చదువుకోవాలని చెప్పారని పేర్కొన్నారు.
