ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారెం శివాజీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన ప్రభుత్వానికి పంపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా కారెం శివాజీని నియమిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. మళ్లీ ఆ పదవి ఎవరికి దక్కుతుందో మరి కొన్ని రోజులు వేచి చూడాలి
