ఆంద్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెనెటీగలు దాడి చేయాయి.. అనిల్ కుమార్ కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ వద్ద పరిశీలనకు వెళ్లినప్పుడు తేనేటీగలు పెద్దఎత్తున దాడి చేశాయ. దాంతో అక్కడ ఆయన గన్ మెన్లతో సహా మరో యాభైమందికి గాయాలు అయ్యాయని సమాచారం.. కాగా ఈ ఘటనలో మంత్రి అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రుల టూర్లలో ఇలాంటి ఘట్టాలు తెలుగు రాష్ట్రాలో జరుగుతన్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు తేనెటీగలు దాడి చేస్తున్నాయి. గతంలో ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేసినప్పుడు వైసిపి అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఇదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలో తేనెటీగలు దాడి చేసిన విషయం కూడా తెలిసిందే.
