మీ చీకటి వ్యవహారాలు బయటపెడితే తలలెక్కడ పెట్టుకుంటారు అని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలకు ఆయన పార్టీ నేతల మీటింగ్ లో జవాబు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి ఏడు చేపల కథ చెబుతారు. అవన్నీచట్టబద్దంగా జరిగాయి. చట్టబద్దంగా చేయని మీ చీకటి వ్యవహారాలు నేనుబయటపెడితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు. అనంతపురం జిల్లాకి వచ్చి నేనుకరవు గురించి మాట్లాడాలి గాని అక్కడ నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలా? వర్షాభావంతో పంటలు లేక పెరిగిపోతున్న వలసలు, నాయకుల పరిశ్రమలు తేకపోవడం వల్ల పెరిగిపోతున్న వలసల మీద మాట్లాడాలి. వాళ్లు కావాలని ఇలాంటి విషయాలు మాట్లాడి రెచ్చగొట్టాలని చూస్తారు ఎవరూరెచ్చిపోవద్దు అని అన్నారు.
