ఆంధ్రలో ఎలక్ట్రికల్ బస్సుల ప్రతిపాదనకు జ్యూడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏపీ ప్రభుత్వం కు సిఫారస్సులు జారీ చేసింది.ఇప్పుడే ఎలక్ట్రికల్ బస్సులు నడపాల్సిన అవసరంలేదని విద్యుత్ బస్సుల టెండర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఏపీ ప్రభుత్వం 350 విద్యుత్ బస్సులను లీజు ప్రతిపాదన మీద తీసుకొని నడపాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, విద్యుత్ బస్సులకంటే డీజిల్ బస్సుల వినియోగమే మేలని ఎలక్ట్రికల్ బస్సుల సాంకేతికత ఇంకా మెరుగుపడాల్సి ఉందని, మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటు లో లేవని జ్యూడిషియల్ ప్రివ్యూ సిఫారస్సులను చైర్మన్ డి. శివశంకర్రావు తెలిపారు.
