తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. జనసేన నుంచి మొత్తం రాష్ట్రంలోనే ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అయితే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశంసలు కురిపిస్తున్నారు రాపాక . అంతేకాదు సీఎం జగన్ చిత్రపట్టానికి పాలాభిషేకాలు చేశారని కూడ సమచారం. ఇదంత ఎందుకంటే నేను దలిత ఎమ్మెల్యేను జగన్ పేద ప్రజలకు ప్రవేశ పథకాలు నచ్చి అంటున్నారు ఎమ్మెల్యే రాపాక. కాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై విమర్శలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడంతో పవన్ కల్యాణ్ కాకినాడలో చేపట్టిన జనసేన రైతు సౌభాగ్యం దీక్షకు రాపాక గైర్హాజరయ్యారు. దీనిపై పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకులతో సీరియస్ గానే చర్చించారు. ఇకపోతే తాజాగా జనసేనకు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. నెలకొకసారి అధినేత పవన్ కల్యాణ్ జనాల్లోకి వస్తానంటే పార్టీకి భవిష్యత్తు ఉండదు అంటూ రాపాక చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోడానికి ఇది సినిమా కాదని ఏకంగా అధినేతపైనే మీడియా ముందు విమర్శలు సంధించారు. సీఎం పదవిపై వ్యామోహం లేదని పవన్ వ్యాఖ్యానించటం వల్లే ప్రజల్లో నమ్మకం పోతుందని అన్నారు. జగన్ లాగా కష్టపడితేనే జనసేనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దీంతో నాయకుడు అంటే నెలకొకసారి కనిపించేవాడు కాదు, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవాడు అని చెప్పినందుకు,.. దళిత MLA రాపాకని పార్టీ నుండి సస్పెండ్ చేసిన పవన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
