ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం..కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే అమరావతిని కేంద్రం రాజధానిగా గుర్తించింది కాబట్టి మూడు రాజధానులకు సహకరించదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా..అమరావతి రైతులను మభ్యపెట్టే పనిలో పడింది. దీంతో మూడు రాజధానులపై కేంద్రం వైఖరిపై భిన్నాభిపాయాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు మరోసారి క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఏర్పాటు అనేది…రాష్ట్రం పరిధిలోని విషయమని..కేంద్రం స్పష్టంగా చెప్పిందని..అయినా ప్రతిపక్షపార్టీలు ఈ విషయంలో కేంద్రం ఏదో చేస్తుందంటూ రైతులను మభ్యపెడుతున్నాయని పరోక్షంగా టీడీపీపై విమర్శలు సంధించారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని కొందరు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు.
అమరావతిలో రాజధాని కొనసాగించాలని బీజేపీ రాజకీయ తీర్మానం చేసిన సంగతిని ఒప్పుకున్న జీవీయల్ అదే సమయంలో అమరావతిలో అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ దందా జరిగిందని ఆరోపించారు.అయితే కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని జీవియల్ తెలిపారు. రాష్ట్ర పరిధిలో రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు..అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం..దీనికి కేంద్రం అభ్యంతరం చెప్పదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు..రైతులను మభ్యపెట్టే విషయాన్ని మానుకోవాలని హెచ్చరించారు.
ఇక అమరావతిని రాజధానిగా గుర్తించిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని జీవియల్ తెలిపారు. అయితే గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిపై జీవో ఇచ్చింది.. జీవో అంటే అక్బర్ శిలా శాసనంలా..చంద్రబాబు నాయుడు శిలా ఫలకం చెక్కారు…కాబట్టి కొత్త జీవో చేసే అధికారం ఎవరీకి లేదని అనుకోవడం భ్రమలో భాగమే అని చురకలు అంటించారు. జీవోలు అనేది వందలకు పైగా వెలువడుతుంటాయి..అయితే కొత్త ప్రభుత్వం జీవోను నిబంధనలకు లోబడి మారిస్తే..కేంద్రం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది అంతే కాని అదేదో శిలాశాసనం చేశారు..దాన్ని మార్చకూడదు అంటే..భ్రమ రాజకీయాలు చేసినట్లే..ప్రజలను మభ్యపెట్టినట్లే అని జీవీఎల్ తెలిపారు. సినిమా ఫక్కీలో భ్రమ రాజకీయాలు..ఏపీలో జరిగినట్లు మరెక్కడా జరగవు అని సెటైర్ వేశారు. కేంద్రం మూడు రాజధానులను అడ్డుకుంటుందని చివరివరకు భ్రమలు కలిగించి..చివరకు నిరాశకలిగించిందని తమపై బురద జల్లడానికి ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తుందని జీవియల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా కేంద్రం ఏదో చేయబోతుందంటూ అమరావతి రైతులను, ప్రజలను మభ్యపెట్టద్దు అని టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.