స్వప్రయోజనాల కోసమే ఐదు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారని ,ఎస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ముందే ఊహించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల ప్రకారం డిపాజిట్‌ను విత్‌డ్రా చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మొత్తం రూ.11 వేల కోట్ల డిపాజిట్లు ఉంటే అందులో రూ.5 వేల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిలో రూ.3 వేల కోట్లు విత్ డ్రా చేశామని, ఎస్ బ్యాంక్, సౌత్ ఇండియా బ్యాంకులు సహా ఫెడరల్ బ్యాంక్‌లో డిపాజిట్లు విత్ డ్రా చేశామని చెప్పారు.మిగిలిన బ్యాంకుల్లోనూ డిపాజిట్లు విత్ డ్రా చేసి త్వరలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తాం వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
