జనసేన అధినేత,హీరో పవన్ కల్యాణ్ రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్తలతో సమావేశంలో బాగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్, లోకేష్ ,టీడీపీ, బీజేపి ,కాపు రిజర్వేషన్లపై.. ఇలా పలు ఆసక్తికర అంశాలపై ఆయన తనదైన రీతిలో రెచ్చపోయి స్పందించారు. అంతేగాక టీడీపీకి, బీజేపీకి మద్దతు తెలపడమనేది ఆవేశంతో చేసిన పని కాదని, ఆలోచనతో చేశానని పవన్ వివరించారు. అనుకుంటే.. ఆ సమయంలో తాను కూడా పోటీ చేసి ఉండేవాడినని కానీ ఓట్లు చీల్చడం తనకు ఇష్టం లేదని అన్నారు. ఆ సమయంలో టీడీపీ-బీజేపీలకు మద్దతు తెలిపినందుకు చాలామంది తనను ప్రశ్నించారని, ఈ విషయంలో చాలామందితో గొడవ కూడా పడ్డానని తెలిపారు. ‘ఒకవేళ అప్పుడు మోడీ ప్రధాని కాకపోయినా.. చంద్రబాబు సీఎం కాకపోయినా ఈపాటికి నన్ను చంపేసేవారు’ అని పవన్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల్ తీవ్రంగా ఖండిస్తున్నారు. పవన్ కల్యాణ్ చంపాల్సిన అవసరం ఏవ్వరికి ఉంది. ఎందుకు చంపాలనుకున్నారు. మరి అప్పుడు చేప్పలేదు..ధైర్యంగా వాళ్లు ఎవరో చెప్పాలని సోషల్ మాడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
